JavaScript is required

శిశు పాఠశాల (ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్) (Early Start Kindergarten) - తెలుగు (Telugu)

మీరు శరణార్థి లేదా శరణార్థి నేపథ్యం నుండి వచ్చినట్లయితే, మీరు శిశు పాఠశాల (ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్ - ESK) కి అర్హులు కావచ్చు. మీబిడ్డ కోసం ప్రతివారం సాధ్యమైనంత గరిష్ట మొత్తంలో ఉచిత బాలశిక్షణ (Kinder) కార్యక్రమ సమయం పొందేలా శిశు పాఠశాల సహాయపడుతుంది.

2023 లో, మూడేళ్ళ బాలల బాలశిక్షణ కార్యక్రమాలు ప్రతి వారం 5 నుండి 15 గంటల మధ్య, మరియు నాలుగేళ్ళ బాలల బాలశిక్షణ కార్యక్రమాలు 15 గంటల పాటు ఉంటాయి. శిశు పాఠశాల ద్వారా నమోదు చేసుకోవడం వలన, మూడేళ్ళ మరియు నాలుగేళ్ళ బాలశిక్షణాలయాలలో ప్రతి వారం పూర్తి 15 గంటలు హామీ ఇవ్వబడుతుంది. ఇది దిగువ పేర్కొన్న బాలల కొరకు లభ్యం అవుతుంది:

  • శరణార్థి లేదా శరణార్థి నేపథ్యం నుండి వచ్చినవారు
  • ఎబొరిజినల్ లేదా టొర్రిస్ స్త్రైట్ ఐలాండర్ గా గుర్తించిన వారు
  • వారి కుటుంబానికి బాలల రక్షణతో సంబంధాలు వున్న వారు

ఈ బాలలు విక్టోరియాలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ, అమలుపరచే కాలంలో వారానికి 15 గంటల ఉచిత లేదా తక్కువ ఖర్చుతో కూడిన కిండర్ ను అందుకోవచ్చు. వారికి ప్రస్తుత అందుబాటు మరియు వారు తీసుకొనే గంటలు మారవు.

ఎలా దరఖాస్తు చేయాలి:

శిశుపాఠశాల, అర్హత కలిగిన ఉపాధ్యాయుని ద్వారా అందించబడే అన్ని బాలశిక్షణా కార్యక్రమాల్లో లభ్యం అవుతుంది. మీకు సమీపంలో ఉన్న బాల శిక్షణాలయాన్ని సంప్రదించి, శిశుపాఠశాల (ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్) గ్రాంట్‌ను అందుకోమని అడగడం ద్వారా మీరు మీ బిడ్డను నమోదు చేసుకోవచ్చు. మీ భాషలో మీకు మద్దతు ఇవ్వడానికి, బాల శిక్షణా కేంద్రాలు ఉచిత అనువాద సేవను అందుకోగలవు.

సహాయం కోసం మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క మూడేండ్ల బాలల, బాల శిక్షణాలయం విచారణ నంబరు 1800 338 663 కు ఫోన్ చేయవచ్చు లేదా మీ స్థానిక పురపాలక సంఘాన్ని సంప్రదించవచ్చు. మీ భాషలో సహాయం పొందడం కొరకు మీరు నేషనల్ ట్రాన్స్ లేటింగ్ అండ్ ఇంటర్ ప్రెటేషన్ సర్వీస్ కు 131 450 కు ఫోన్ చేయవచ్చు. ఆ అనువాదకుని, మీ స్థానిక పురపాలక సంఘం లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు ఫోన్ చేయమని అడగండి. అనువాదకులు ఫోన్ లో ఉండి తర్జుమా చేస్తారు.

ఎప్పుడు దరఖాస్తు చేయాలి:

బాలలు బాలశిక్షణాలయానికి హాజరు కావడానికి నమోదు చేసుకున్న సంవత్సరంలో ఏప్రిల్ 30కి ముందు మూడేళ్లు నిండితే ముందస్తు ప్రారంభ బాలబడికి అర్హులు. 'ఎప్పుడు నమోదు చేసుకోవాలో' చూడండి.

మీ బిడ్డ పాఠశాలకు ఐదేళ్లు వచ్చినప్పుడు వెళ్ళాలా లేక ఆరేళ్లకు వెళ్ళాలా అనేది మీరు నిర్ణయించు కోవచ్చు. అప్పుడు, వారు మూడేళ్లు లేదా నాలుగేళ్ళు నిండిన సంవత్సరంలో శిశు పాఠశాలలో చేరవచ్చు.

మీ బిడ్డ శిశు పాఠశాలకి ఎప్పుడు అర్హత సాధిస్తారో లెక్కకట్టటానికి మీకు సహాయం అవసరమైతే, మీరు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని కాని, మీ స్థానిక పురపాలకసంఘాన్ని కాని, మీ మాతా మరియు శిశు ఆరోగ్య నర్సుని కాని, లేదా మీ ప్రాంతంలోని ఒక కిండర్, లేదా మీ ప్రాంతంలోని దిగువ పేర్కొన్న సంస్థల్లో దేనినైనా సంప్రదించవచ్చు.

  • మూడేండ్ల బాలల శిక్షణ విచారణ ఫోన్ 1800 338 663
  • బ్రదర్ హుడ్ ఆఫ్ లారెన్స్ 03 9483 1183
  • ఫౌండేషన్ హౌస్ 03 9389 8900
  • ఎఫ్ కె ఎ చిల్డ్రన్స్ సర్వీసెస్ 03 9428 4471
  • VICSEG న్యూ ఫ్యూచర్స్ 03 9383 2533

Updated