కుటుంబాల కోసం మార్గదర్శని

మీ కిండర్ కిట్ గురించి
మీ పిల్లల అభ్యాసం మరియు అభివృద్ధికి తోడ్పడటానికి ఆట ఒక ఆహ్లాదకరమైన మరియు ఆకర్షణీయమైన మార్గం. తల్లిదండ్రులు, సంరక్షకులు మరియు కుటుంబాలు ఆ ప్రయాణంలో అతి పెద్ద భాగం.
కిండర్ కిట్‌లు పుస్తకాలు, విద్యాపరమైన బొమ్మలు మరియు మీ పిల్లలు మరియు కుటుంబం ఇంట్లో ఆనందించడానికి తయారు చేసిన కార్యకలాపాలతో నిండి ఉంటాయి.
ప్రతి కిండర్ కిట్‌లో ప్రత్యేకంగా మూడు సంవత్సరాల పిల్లల కోసం తయారు చేయబడిన వస్తువులు ఉంటాయి.

విక్టోరియన్ ఎర్లీ ఇయర్స్ లెర్నింగ్ మరియు డెవలప్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్
బాల కేంద్ర ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు మీ బిడ్డ ఎదగడానికి మరియు నేర్చుకోవడానికి మద్దతు ఇస్తారు.
కిండర్ గార్టెన్ కార్యక్రమాలు విక్టోరియన్ ఎర్లీ ఇయర్స్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ (VEYLDF) ని ఉపయోగిస్తాయి.
మీ కిండర్ కిట్‌లోని ప్రతీదీ VEYLDFలో 1 లేదా అంతకంటే ఎక్కువ అభ్యాసం మరియు అభివృద్ధి ఫలితాలతో సంబంధం కలిగి ఉంటుంది:
- గుర్తింపు
- అభ్యాసం
- సమాజం
- సంప్రదింపు
- శ్రేయస్సు
వెనుక మోపు (బ్యాక్‌ప్యాక్)
కిండర్ కిట్ వెనుక మోపు (బ్యాక్‌ప్యాక్) లను ప్రతిరోజూ ఉపయోగించవచ్చు.
వెనుకవైపు కార్డ్‌బోర్డ్ ట్యాగ్‌పై గీయడం ద్వారా మీ పిల్లలు సాధన చేయవచ్చు, తద్వారా వారి సంచి ఏదో వారికి తెలుస్తుంది.
వెనుక మోపు (బ్యాక్‌ప్యాక్) ను విప్పండి మరియు వెల్క్రో ట్యాబ్‌లతో సురక్షితం చేయండి. ఊహాత్మక ఆట కోసం ఫెల్ట్ ఉపరితలాన్ని ఉపయోగించండి.

- సంచి మీ పిల్లల వీపుపై కూర్చునేలా వెనుక మోపు (బ్యాక్‌ప్యాక్) పట్టీలను బిగించండి లేదా వదులు చేయండి.
- ఫెల్ట్ స్టిక్కర్‌లతో తోటను సృష్టించండి.
- పేరు టేగ్ పై గీయాడాన్ని ప్రోత్సహించండి.
- ముందస్తు వ్రాయు నైపుణ్యాలను సాధన చేయండి.
చదువుట
కుటుంబ సమేతంగా సమయాన్ని గడపడానికి చదవడం గొప్ప మార్గం. అక్షరాస్యత అభివృద్ధి మద్ధతుకి ఇది అత్యంత ముఖ్యమైన మార్గాల్లో ఒకటిగా ఉంటుంది.
మీ పిల్లలతో ఒక సాధారణ కథన సమయాన్ని పంచుకోవడం వారి ఊహ మరియు పదజాలాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.

- కలిసికట్టుగా ఒక పుస్తకాన్ని ఎంచుకోండి.
- స్థిరంగా చదవడానికి అనుకూలమైన స్థలాన్ని కనుగొనండి.
- కథలో తదుపరి ఏమి రావచ్చనే దాని గురించి వారి ఆలోచనలను పంచుకోవడానికి వారికి సమయం ఇవ్వండి.
- విభిన్న స్వరాలను ఉపయోగించండి.
గీయడం మరియు గుర్తులను తయారుచేయడం
గీయడం మరియు గుర్తులను తయారుచేయడం పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుంది. కాగితంపై క్రేయాన్‌లతో ప్రయోగాలు చేయడం ద్వారా, పిల్లలు:
- ఎలా వ్రాయాలో నేర్చుకోవడం ముఖ్యం గనుక చక్కటి శరీర చలన నైపుణ్యాలను పెంపొందించుకుంటారు
- వారి చేతి-కంటి సమన్వయాన్ని మెరుగుపరుస్తాయి
- రంగులు, ఆకారాలు, నమూనాలు మరియు రేఖల గురించి తెలుసుకుంటారు
- సృజనాత్మకతను వ్యక్తపరుస్తారు
- ఇతరులతో సంప్రదిస్తారు.

- గీసే ప్రక్రియను ఆస్వాదించడానికి మీ బిడ్డను ప్రోత్సహించండి. గీసే ప్రక్రియ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.
- మీరు గీస్తున్నప్పుడు మాట్లాడండి.
- రంగులు మరియు ఆకారాలను గమనించండి మరియు వాటి పేరు చెప్పండి.
సృజనాత్మక కార్యకలాపాలు
సృజనాత్మక ఆట మీ పిల్లల 5 ఇంద్రియాలను - దృష్టి, వాసన, వినికిడి, స్పర్శ మరియు రుచిని ప్రేరేపిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడానికి, కనుగొనడానికి మరియు తెలుసుకోవడానికి ఇది ఒక ఆహ్లాదకరమైన మార్గం.

- బ్లాక్‌లను పేర్చేటప్పుడు స్థితిస్థాపకతను అభ్యసించడాన్ని ప్రోత్సహించండి. పడిపోతే, మీ బిడ్డ 3 గాఢమైన శ్వాసలను తీసుకొని మళ్లీ ప్రయత్నించవచ్చు.
- సుద్దమట్టిని బంతిగా చుట్టడానికి ప్రయత్నించండి, ఆకారాలు చేయండి, చదును చేయండి, పిసకండి.
- కలిసి సంగీతం పాడండి. మీ చేతులతో చప్పట్లు కొట్టడం ద్వారా లేదా మీరు ఇంట్లో ఉన్న వస్తువులపై కొట్డడం ద్వారా విభిన్న లయలు మరియు శబ్దాలను సృష్టించండి.
బయట ఆడటం
పర్యవేక్షించబడే బహిరంగ ఆట మీ పిల్లల పెరుగుదల, అభివృద్ధి మరియు శ్రేయస్సులో పెద్ద భాగం.
పిల్లలు చేయగలిగినవి:
- ప్రకృతి గురించి తెలుసుకోవడం ద్వారా శాస్త్ర సంబంధమైన అన్వేషణ మరియు అభివృద్ధి
- స్వేచ్ఛా భావాన్ని పొందడం
- ఇతర పిల్లలతో సామాజిక సంప్రదింపులు
- ఆడుతున్నప్పుడు మంచి ఎంపికలు ఎలా చేయాలో అన్వేషించడం మరియు తెలుసుకోవడం
- మొత్తం శరీర కదలిక, చేతి-కంటి సమన్వయం మరియు చక్కటి శరీర చలన మరియు సృజనాత్మకత నైపుణ్యాలను అభివృద్ధి చేయడం.

- ఆకుల గురించి మాట్లాడండి మరియు వివిధ రంగులు మరియు ఆకారాల పేర్లు చెప్పండి.
- కలిసి విత్తనాలను నాటండి.
- ప్రకృతితో మమేకమవ్వండి. మన పర్యావరణాన్ని రక్షించడం గురించి మాట్లాడండి.
- ఇసుక కోటలు నిర్మించండి.
నాటకీయ ప్రదర్శన
నాటకీయ ప్రదర్శన పిల్లలను ఊహాత్మక కథలను నటించడానికి మరియు ఇతర పాత్రలను పోషించడానికి ప్రోత్సహిస్తుంది.
పిల్లలు ముఖ్యమైన భాష మరియు సామాజిక నైపుణ్యాలను అభ్యసించడానికి నాటకీయ ప్రదర్శనలను ఉపయోగిస్తారు, వీటిలో:
- కొత్త ప్రపంచాలను అన్వేషించడం మరియు సృష్టించడం
- పంచుకోవడం మరియు వంతులు తీసుకోవడం
- పరస్పరం సంభాషించే మరియు చర్చల మార్గాలు.

- జంతువుల పేర్లను ఆంగ్లంలో మరియు ఇతర భాషలలో చెప్పండి.
- పాత్రలను సృష్టించండి.
- కథలను అల్లండి.
- భావాలను మరియు విభిన్న భావోద్వేగాలను అన్వేషించడానికి మరియు వ్యక్తీకరించడానికి తోలుబొమ్మలను ఉపయోగించండి.
ఆటలు
మీ పిల్లల సామాజిక నైపుణ్యాలను పెంపొందించడానికి కుటుంబం మరియు స్నేహితులతో ఆటలు ఆడటం గొప్ప మార్గం.
పిల్లలు సంఖ్యాశాస్త్రం, భాష మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్చుకోవడంలో ఆటలు సహాయపడతాయి.

- ఆట నియమాలను తెలుసుకోండి మరియు వంతులు తీసుకోవడం సాధన చేయండి.
- సమస్య పరిష్కారం మరియు జ్ఞాపకశక్తి నైపుణ్యాలను సాధన చేయండి.
- సంఖ్యలను చర్చించండి మరియు వస్తువులతో లెక్కించడాన్ని సాధన చేయండి.
సమాజ నిర్మాణం
ఆట ద్వారా పిల్లలు తమ గురించి మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కనుగొంటారు మరియు నేర్చుకుంటారు. చిన్నారుల కోసం, ఆట మరియు అభ్యాసం జోడీగా వెళతాయి. మీ కిండర్ కిట్‌లోని అంశాలు వైవిధ్యం మరియు విభిన్న సంస్కృతుల గురించి సంభాషణలు చేయడానికి మీకు మద్దతు ఇస్తాయి.

- మీ చిన్నారితో ఇతర దేశాలు మరియు వాటి స్థానిక జంతువుల గురించి మాట్లాడండి.
- వివిధ భాషలు ఎక్కడ నుండి ఉద్భవించాయో తెలుసుకోవడానికి ప్రపంచ పటాన్ని చూడండి.
గుర్తింపును గౌరవించడం
అన్ని సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి పిల్లలను ప్రోత్సహించడం అవగాహన, అంగీకారం మరియు అభిమానాన్ని పెంచుతుంది. విక్టోరియాలో, ఆదిమవాసులు మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ద్వీప సంస్కృతులు మరియు కూరీ సంస్కృతులు నేడు సజీవంగా అభివృద్ధి చెందుతున్నాయి. కిట్‌లలో రచయితలు మరియు కళాకారులుగా వారిని గుర్తించడం మాకు గర్వకారణం. కూరీ సంప్రదాయాలు మరియు సంస్కృతుల గురించి మరింత తెలుసుకోవడానికి మీ పిల్లలకు సహాయపడే కొన్ని కార్యకలాపాలు ఇక్కడ ఉన్నాయి:

- వస్తువులు లేదా జంతువుల కోసం కూరీ చిహ్నాలను తెలుసుకోండి.
- కూరీ సంస్కృతులు, నాయకులు మరియు కథానాయకుల గురించి తెలుసుకోండి మరియు మాట్లాడండి.
- దేశం యొక్క గుర్తింపు ప్రాముఖ్యతను కనుగొనండి.
విక్టోరియన్ అబోరిజినల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఇంక్. వెబ్సైట్ కూరీ సంప్రదాయాలు మరియు సంస్కృతులను అన్వేషించే ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన కార్యకలాపాలను కలిగి ఉంది.
అస్లాన్లో పుస్తకాలు
ఆస్లాన్ అనేది విక్టోరియా యొక్క ఎర్లీ చైల్డ్ హుడ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్‌లో ఉపయోగించే సంకేత భాష. ఈ కార్యక్రమం కొన్ని నాలుగు-సంవత్సరాల కిండర్ గార్టెన్‌లలో అందుబాటులో ఉంది.
చిన్న వయస్సులో పిల్లలు మరొక భాష నేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, అవి:
- చదవడానికి మరియు వ్రాయడానికి ముందున్న నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి
- అభిజ్ఞ వశ్యత
- ఆత్మగౌరవం మరియు శ్రేయస్సును పెంచడం
- సాంస్కృతిక అస్థిత్వాన్ని బలపరుస్తుంది.
2025 కిండర్ కిట్‌లలో ఉంచబడిన అనేక పుస్తకాలలో ఆస్లాన్ అనువాదాలు అందుబాటులో ఉన్నాయి.

- ఆస్లాన్ ద్వారా భావాలను వ్యక్తపరచండి.
- ఆస్లాన్‌లో పలకరించండి.
శ్రేయస్సు మరియు అదనపు మద్దతు
చిన్నారులందరూ వారి సొంతమైన వేగంతో భిన్నంగా నేర్చుకుంటారు. కిండర్ కిట్లు మీ పిల్లల పుస్తకాలు మరియు విద్యా బొమ్మలను, అన్ని సామర్థ్యాలను సవాలు చేయడానికి అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.
మీకు లేదా మీ పిల్లలకు అదనపు మద్దతు అవసరమైతే, కింది మార్గాల ద్వారా సహాయం అందుబాటులో ఉంటుంది:

- సహాయపడే నైపుణ్యాలు మరియు జ్ఞానం బాలకేంద్రాల ఉపాధ్యాయులకు ఉన్నాయి. మీ ప్రశ్నల గురించి మీ పిల్లల బాలకేంద్ర ఉపాధ్యాయునితో మాట్లాడండి.
- మీ సందేహాల గురించి చర్చించడానికి మీ వైద్యుడు లేదా మాతాశిశు ఆరోగ్య ఉపచారికను చూడడానికి అపాయింట్మెంట్తీసుకోండి.
- ఉచితమైన, విశ్వసనీయమైన సలహా మరియు మద్ధతు కోసం పేరెంట్ లైన్ 13 22 89 కి సంప్రదించండి.
బాల శిక్షణా కేంద్రాలలో ఉద్యోగావకాశాలు
విక్టోరియాలో పెరుగుతున్న కిండర్ గార్టెన్లలో వృత్తిని ప్రారంభించడాన్ని పరిగణించండి. బాలకేంద్ర ఉపాధ్యాయుడు లేదా విద్యావేత్త కావడానికి మీకు మద్దతు ఇవ్వడానికి, ఇవి ఉన్నాయి:
- వెసులుబాటుగల అధ్యయన ఎంపికలు
- ఉదారమైన విద్యార్థి వేతనాలు
- ఆర్థిక ప్రోత్సాహకాలు.

మీ కిండర్ కిట్ ని దానం చేస్తున్నారు
మీ పిల్లలు వారి కిండర్ కిట్ వస్తువులను ఉపయోగించిన తర్వాత, వాటిని మరొకరు ప్రేమతో ఉపయోగించుకునేలా స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వడాన్ని పరిగణించండి.
ఒక వస్తువును విరాళంగా ఇవ్వవచ్చో లేదో నిర్ణయించేటప్పుడు, సహాయక మార్గదర్శకం: నేను దీన్ని స్నేహితుడికి ఇవ్వాలా? సమాధానం అవును అయితే, దాతృత్వానికి ఇవ్వడం సముచితం.
అనుకూలమైన వస్తువులను దానం చేయడం స్థిరత్వం మరియు వాతావరణ మార్పులతో పోరాడటం కోసం చాలా ముఖ్యమైనది.

Updated